కాంగ్రెస్‌లో చేరికపై త్వరలో చెబుతా: కొండా

తాజా వార్తలు

Published : 13/07/2021 20:46 IST

కాంగ్రెస్‌లో చేరికపై త్వరలో చెబుతా: కొండా

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ చేపట్టనున్న నిరుద్యోగ దీక్షలో పాల్గొంటానని ప్రకటించిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పుడు చేరేది త్వరలో ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఇవాళ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. విశ్వేశ్వర్‌రెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో పరిణామాలు, తాజా రాజకీయాలపై చర్చించారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలంగాణ మంచి కోసం పరితపించే వ్యక్తి అని, ఆయనతో రాజకీయ పరమైన అంశాలకంటే.. అభివృద్ధి అంశాల మీదనే ఎక్కువ చర్చించినట్టు రేవంత్‌రెడ్డి చెప్పారు.

నిరుద్యోగం, కృష్ణా జలాల విషయంలో జరుగతున్న పరిణామాలపై చర్చించామన్న రేవంత్‌.. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మర్చారని ఆరోపించారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసినప్పటికీ ఆయన తన ఐడియాలజీకి చేయలేదన్నారు. ఎప్పుడైనా ఆయన కాంగ్రెస్‌లోకి రావొచ్చని పేర్కొన్నారు. రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడు కావాలని కాంగ్రెస్‌ పార్టీలో, బయట కొట్లాడానని, ఇప్పుడు రేవంత్‌కు పీసీసీ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తానే స్వయంగా వెళ్లి కలుద్దామనుకున్నప్పటికీ రేవంతే వస్తానని.. వచ్చి కలిశారని, రాష్ట్ర పరిణామాలపై చర్చించినట్టు తెలిపారు. తెలంగాణ ఆకాంక్షలతో ఎవరు ఏ పోరాటం చేసినా మద్దతిస్తానని స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని