సంజీవరెడ్డిని కలిసిన రేవంత్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 18/07/2021 04:15 IST

సంజీవరెడ్డిని కలిసిన రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డిని హైదరాబాద్‌ బర్కత్‌పురాలోని ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రేవంత్‌ రెడ్డి నియామకంతో పార్టీకార్యకర్తల్లో ఉత్సాహం వచ్చిందన్నారు. అందరినీ కలుపుకొని పోతూ పనిచేయాలన్నారు. బలమైన కార్మికసంఘం ఐఎన్టీయూసీ .. కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేసేలా చూడాలని రేవంత్‌రెడ్డి కోరారని, పార్టీ బలోపేతం కోసం కార్మికులు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి మరోసారి కూలంకషంగా చర్చించేందుకు రేవంత్‌రెడ్డి మరోసారి వస్తానని చెప్పారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కలిసి పనిచేస్తామని సంజీవరెడ్డి చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని