హైదరాబాద్‌కు తెరాస చేసిందేమీ లేదు: రేవంత్‌

తాజా వార్తలు

Updated : 23/11/2020 12:41 IST

హైదరాబాద్‌కు తెరాస చేసిందేమీ లేదు: రేవంత్‌

హైదరాబాద్‌: వందలమంది ఆత్మబలిదానాలతో తెలంగాణ సాధించుకున్నామని మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌లో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని వందల ఏళ్ల క్రితమే నిజాం పాలకులు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. 

‘‘తెలంగాణ ఏర్పడిన తర్వాత విధ్వంస పాలన సాగుతోంది. తెరాస వల్లే మెట్రో వ్యయం పెరిగింది. ఎంఐఎం కోసం గౌలిగూడ వరకు మెట్రో నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో మెట్రోకు రూ.3500 కోట్ల నష్టం. మాయ మాటలతో కేటీఆర్‌ ప్రజల్ని మోసం చేస్తున్నారు. రూ.67వేల కోట్లతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామనడం పచ్చి అబద్దం. నగరానికి ఖర్చు పెట్టింది రూ.6వేల కోట్లు మాత్రమే. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను తమ ఖర్చుల్లో కలిపి చూపిస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయి. వరద బీభత్సం ప్రకృతి వైపరీత్యం కాదు.. పాలకుల వైఫల్యం. ప్రభుత్వ వైఫల్యం వల్లే హైదరాబాద్‌కు వరదలు. హైదరాబాద్‌ ప్రజలకు టీఆర్ఎస్‌ చేసిందేమీ లేదు’’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని