భూములు కట్టబెట్టడం కొనసాగుతోంది: రేవంత్‌

తాజా వార్తలు

Updated : 19/07/2021 17:11 IST

భూములు కట్టబెట్టడం కొనసాగుతోంది: రేవంత్‌

హైదరాబాద్‌: గతంలో ఐటీ పార్కుల పేరిట బెదిరించి భూములు లాక్కున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ తన బంధువులకు భూములు కట్టబెట్టడం కొనసాగుతోందని విమర్శించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఔటర్‌ రింగ్‌రోడ్డును అధికారులు ఇష్టారీతిన మార్చారని అన్నారు. ఈ విషయంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక ఇచ్చిందని, కానీ, ఆ నివేదికను బుట్టదాఖలు చేసి అందులో ఒక అధికారిని సిద్దిపేట కలెక్టర్‌ నియమించారని అన్నారు. కోకాపేటలో అమ్మకుండా మిగిలిన భూమిని తక్కువ ధరకు అమ్ముతున్నారని విమర్శించారు.మరోవైపు తనను పార్లమెంట్‌ సమావేశాలకు వెళ్లకుండా తనను అడ్డుకుంటున్నారని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు రేవంత్‌ లేఖ రాసిన విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌ కూడా ఈ అంశాన్ని లోక్‌సభ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడంపై పోలీసులు స్పందించారు. ఈ మేరకు బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌కు లేఖ రాశారు. పార్లమెంట్‌కు వెళ్లకుండా తాము అడ్డుకోవడం లేదని పేర్కొన్నారు. కోకాపేట భూముల వద్ద ఆందోళనకు అనుమతి లేదని, అందువల్లే రేవంత్‌ నివాసం వద్ద పోలీసు బలగాలను మోహరించినట్టు స్పష్టంచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని