అసోంలో ఆర్జేడీ పోటీ

తాజా వార్తలు

Published : 27/02/2021 18:40 IST

అసోంలో ఆర్జేడీ పోటీ

గువాహటి: త్వరలో జరగబోయే అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలిసి ఆర్జేడీ పోటీ చేయబోతోందని ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్‌ వెల్లడించారు. ఇందుకోసం ఒకే ఆలోచనా ధోరణి కలిగిన పార్టీలతో జట్టు కట్టనున్నట్లు తెలిపారు. శనివారం గువాహటిలో పర్యటించిన ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్‌తో చర్చించామని, ఏఐయూడీఎఫ్‌తో కూడా చర్చించనున్నామని చెప్పారు.

కాంగ్రెస్‌, ఏఐయూడీఎఫ్‌తో పాటు చిన్న చిన్న పార్టీలతో కూడా టచ్‌లో ఉన్నామని తేజస్వి అన్నారు. బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సుమారు ఐదు శాతం హిందీ మాట్లాడే ప్రజలు సుమారు 11 స్థానాల్లో కీలకం కానున్నారని తెలిపారు. కానీ, గెలిచేందుకు అవకాశం ఉన్న చోటే తాము పోటీచేస్తామని చెప్పారు. అలాగే, ఎన్నికలు జరగబోయే పశ్చిమ బెంగాల్‌, కేరళ, పుదుచ్చేరిలో సైతం పర్యటించి భాజపా, దాని మిత్రపక్షాలకు వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొంటామని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని