నాపై మరిన్ని ఆరోపణలు వస్తాయ్‌: పైలట్‌
close

తాజా వార్తలు

Updated : 20/07/2020 21:43 IST

నాపై మరిన్ని ఆరోపణలు వస్తాయ్‌: పైలట్‌

దిల్లీ: భాజపాలో చేరాలని తనపై ఒత్తిడి తెచ్చారంటూ ఎమ్మెల్యే గిరిరాజ్‌ సింగ్‌ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్‌ రెబల్‌ నేత సచిన్‌ పైలట్‌ స్పందించారు. ఆ వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. ఈ తరహా వ్యాఖ్యలను తాను ముందే ఊహించానని పేర్కొన్నారు. సదరు ఎమ్మెల్యేపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గతేడాది బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే గిరిరాజ్‌ సింగ్‌ తాజాగా సచిన్‌ పైలట్‌పై ఆరోపణలు చేశారు. భాజపాలో చేరాలని తనపై సచిన్‌ పైలట్‌ ఒత్తిడి తెచ్చారని చెప్పారు. అందుకోసం రూ.35 కోట్లు పైలట్‌ ఇవ్వజూపినట్లు వెల్లడించారు. అందుకు తాను నిరాకరించి.. విషయాన్ని సీఎం గహ్లోత్‌కు చెప్పానని గిరిరాజ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

దీనిపై సచిన్‌ పైలట్‌ స్పందిస్తూ.. ‘‘ఈ వ్యాఖ్యలు బాధించేవే అయినా.. నేను పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఇలాంటి నిరాధార, అసత్య ఆరోపణలు ముందు ముందు మరిన్ని వస్తాయి. కేవలం నా పేరు, ప్రతిష్ఠలను దిగజార్చేందుకు కుట్ర జరుగుతోంది. కేవలం కాంగ్రెస్‌ సభ్యుడిగా రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు నా  విశ్వనీయతను దెబ్బతీసేందుకే ఇవన్నీ జరుగుతున్నాయి’’ అని సచిన్‌ పైలట్‌ అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని