Ap News: చంద్రబాబు దీక్ష ఓ డ్రామా: సజ్జల

తాజా వార్తలు

Published : 23/10/2021 01:10 IST

Ap News: చంద్రబాబు దీక్ష ఓ డ్రామా: సజ్జల

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన దీక్ష ఓ డ్రామా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఈ దీక్ష ద్వారా ఆయన ప్రజలకు ఏం సందేశం ఇచ్చారని ప్రశ్నించారు. 36గంటల పాటు నిరాహార దీక్ష చేసిన 72ఏళ్ల వ్యక్తి గంటకు పైగా ఆవేశంతో ఎలా మాట్లాడగలిగారని ప్రశ్నించారు. ప్రజలకు సంబంధించిన ఒక్క అంశంపైనా చర్చించలేదని విమర్శించారు. పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలను సమర్థిస్తూ దానిపై ఓ ఉద్యమం నడిపేందుకు శ్రీకారం చుట్టడంలో భాగంగానే చంద్రబాబు దీక్షకు
కూర్చున్నట్టుందని ఎద్దేవా చేశారు. తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి ఏమన్నారో చంద్రబాబు ఎందుకు వినలేదని ప్రశ్నించారు. గత రెండున్నరేళ్లుగా.. రాష్ట్రంలో  ఎన్నడూ చూడని సుభిక్షమైన పాలన జగన్ అందిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో పోటీచేస్తే డిపాజిట్లు కూడా రావని తెలిసే    బద్వేల్‌లో పోటీ చేయకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు. గంజాయి ఒక్క రాత్రిలో వచ్చిందని తెదేపా నేతలు చెబుతున్నారు... కానీ,  ఈఒక్క ఏడాదిలో 2.93లక్షల కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారని  
వివరించారు. దీక్ష ముగింపు సందర్భంగా చంద్రబాబు అన్నీ అవాస్తవాలు మాట్లాడారని సజ్జల విమర్శించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని