AP News: జగన్‌ అందర్నీ సమానంగా చూశారు: సజ్జల
close

తాజా వార్తలు

Updated : 30/05/2021 14:33 IST

AP News: జగన్‌ అందర్నీ సమానంగా చూశారు: సజ్జల

అమరావతి: వైకాపా రెండేళ్ల పాలనలో మునుపెన్నడూ చూడని అభివృద్ధిని సీంఎ జగన్‌ సాధించారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుణాత్మక మార్పు తీసుకొస్తారని ప్రజలు పెట్టుకున్న ఆశలను జగన్‌ నెరవేర్చారని చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైకాపా నేతలు సంబరాలు చేసుకున్నారు. ‘ప్రజాపాలనకు రెండేళ్లు’ పేరిట తయారు చేసిన ప్రత్యేక కేక్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి కట్‌ చేశారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల పాలనలోనే మునుపెన్నడూ చూడని అభివృద్ధిని జగన్‌ సాధించారని చెప్పారు.

‘‘అధికారం చేపట్టిన తర్వాత ప్రతిక్షణం విలువైనదేనని భావిస్తూ సీఎం జగన్‌ శ్రమిస్తున్నారు. 5కోట్ల ప్రజలను తన కుటుంబంగా భావించి పనిచేస్తున్నారు. గత 15 ఏళ్లలో కలగానే మిగిలిపోయిన ఎన్నో హామీలను రెండేళ్లలో జగన్‌ నెరవేర్చారు. సంక్షేమం, అభివృద్ధి వేర్వేరు కాదని.. సంక్షేమం ద్వారా అభివృద్ధి చేయాలంటూ రాజ్యాంగ రచయితల ఆలోచనను సీఎం ఆవిష్కరింపజేశారు. రాష్ట్ర విభజన, కరోనాతో ఆర్థికంగా కష్టాలు వచ్చినా వాటిని అధిగమించారు. పాలన, సంక్షేమపరంగా అన్ని వర్గాలను ఆయన సమానంగా చూశారు. జగన్‌లాంటి నాయకులు యుగానికి ఒక్కరొస్తారేమో అనేలా పాలన సాగించారు. ఆయన ప్రారంభించిన గ్రామ సచివాలయ వ్యవస్థను ఇప్పుడు దేశమంతా చూస్తోంది. పథకాలను నిరంతర ప్రక్రియగా చేపట్టి అవినీతి, అక్రమాలు లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నారు. రాష్ట్రంలో జేసీబీ, ఏసీబీ పాలన నడుస్తోందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడటం సరికాదు’’ అని సజ్జల అన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని