కేసీఆర్‌.. సీమ కష్టాలు తెలుసన్నారు: సజ్జల

తాజా వార్తలు

Updated : 03/07/2021 11:26 IST

కేసీఆర్‌.. సీమ కష్టాలు తెలుసన్నారు: సజ్జల

అమరావతి: జలవివాదం పరిష్కారం కావాలనే ప్రధాని నరేంద్రమోదీకి సీఎం జగన్‌ లేఖ రాశారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ నీరు తీసుకోవడమే రాయలసీమ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. అమరావతిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని గతంలో సీఎం కేసీఆర్‌ అంగీకరించడమే కాకుండా ప్రోత్సహించారు. రాయలసీమ నీటి విషయంలో పెద్దన్నగా ఉంటానని కేసీఆర్ మాటిచ్చారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నేనూ ఉన్నాను. సీమ కష్టాలు తెలుసునని.. పరిష్కరించుకుందామని కేసీఆర్ చెప్పారు. నీటి విషయంలో ఇచ్చి పుచ్చుకునేలా ఉండాలని కేసీఆర్ అన్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు.

ప్రాజెక్టులో 834 అడుగుల సామర్థ్యం నిల్వ ఉన్న సమయంలో విద్యుదుత్పత్తి మొదలు పెట్టాల్సి ఉండగా.. 800 అడుగల కంటే తక్కువ సామర్థ్యం వద్దే తెలంగాణ జెన్‌కో ఉత్పత్తి చేస్తుందన్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీకి నిత్యం వచ్చిన నీరు వచ్చినట్లుగానే వదిలేయాల్సిన పరిస్థితులను సృష్టించారని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో నీటి కష్టాలు తప్పవని సజ్జల హెచ్చరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని