ఒక్క నీటి చుక్కనూ వదులుకోం: సజ్జల

తాజా వార్తలు

Updated : 04/07/2021 13:49 IST

ఒక్క నీటి చుక్కనూ వదులుకోం: సజ్జల

అమరావతి: జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తామని తెలిపారు. ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం అని స్పష్టం చేశారు. జల వివాదంపై ఇప్పటికే అందరికీ లేఖలు రాశామని చెప్పారు. కేంద్రం కూడా మధ్యవర్తిత్వం వహిస్తోందన్నారు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాం అని వివరించారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామన్నారు.

రెచ్చగొడితే రెచ్చిపోమని సందర్భోచితంగా స్పందిస్తామని సజ్జల తెలిపారు. కృష్ణా బేసిన్‌లో విద్యుత్‌ ఉత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం ఆపాలని ఏపీ, పోతిరెడ్డిపాడు వద్ద ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించొద్దని తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని