మినీ పురపోరు: మేయర్ల ఎన్నికకు నోటిఫికేషన్‌
close

తాజా వార్తలు

Published : 06/05/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మినీ పురపోరు: మేయర్ల ఎన్నికకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌: మినీ పురపోరులో భాగంగా మేయర్, ఛైర్ పర్సన్ పదవుల కోసం పరోక్ష ఎన్నికలు ఈ నెల ఏడో తేదీన జరగనున్నాయి. ఇందుకోసం రెండు నగరపాలికలు, ఐదు పురపాలికల పాలక మండళ్ల ప్రత్యేక సమావేశాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు; సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఏప్రిల్ 30న పోలింగ్ జరగ్గా ఈ నెల మూడో తేదీన ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. ఆయా కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్; మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ల ఎన్నిక కోసం 7వ తేదీన పరోక్ష ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్లు నియమించిన గెజిటెడ్ అధికారులు 6వ తేదీలోగా ఎన్నిక నోటీసు జారీ చేస్తారు. 7వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది.

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో పూర్తిగా కొవిడ్ నిబంధనలకు లోబడి పరోక్ష ఎన్నికను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశించింది. ప్రత్యేక సమావేశ విధుల్లో ఉండే వారందరికీ కొవిడ్ నెగెటివ్ నిర్ధారణ కావాలని స్పష్టం చేసింది. ఎన్నికైన సభ్యుల్లో ఎవరైనా కరోనా బారిన పడి క్వారంటైన్‌లో ఉంటే వీడియో కాల్ ద్వారా ప్రమాణం చేయడంతో పాటు ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పించాలని.. దీన్ని ప్రిసైడింగ్ అధికారి మొబైల్ ఫోన్లో రికార్డు చేయాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. సమావేశం పూర్తయ్యాక ఎటువంటి ర్యాలీలు చేయరాదని ఎస్ఈసీ ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని