ప్రవీణ్‌ ప్రకాష్‌ వ్యవహారంలో ఎస్‌ఈసీ ఆగ్రహం

తాజా వార్తలు

Published : 30/01/2021 18:04 IST

ప్రవీణ్‌ ప్రకాష్‌ వ్యవహారంలో ఎస్‌ఈసీ ఆగ్రహం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్ తొలగింపు ఆదేశాలు అమలుకాకపోవడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌ జరపకుండా చేశారని, జీఏడీకి అధిపతిగా ఉన్న ప్రవీణ్‌ తన ఆదేశాలను పట్టించుకోలేదనే కారణంతో విధుల నుంచి తొలగించాలని సీఎస్‌కు సూచిస్తూ గతంలో లేఖ రాశారు. అధికారులను సన్నద్ధం చేయడంలో విఫలమయ్యారని, అందుకే ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తన ఆదేశాలు అమలు కాకపోవడంతో సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎస్‌ఈసీ మరోసారి లేఖ రాశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ హోదాలో ఉన్న అధికారి ఆదేశాలు అమలు చేయకపోవడం చట్టవిరుద్ధమన్నారు. తన ఆదేశాల ఉల్లంఘనపై తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తన ఆదేశాలు అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ అవుతుందని వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌ జరగకుండా చూశానని ప్రవీణ్‌ అంగీకరించారని సీఎస్‌ దృష్టికి తీసుకొచ్చారు.

ఇవీ చదవండి..

ప్రవీణ్‌ ప్రకాశ్‌ను తప్పించండి

ఏపీ సీఎస్‌కు ప్రవీణ్ ప్రకాశ్‌ లేఖ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని