ఏపీ సీఎస్‌కు నిమ్మగడ్డ మరో లేఖ

తాజా వార్తలు

Updated : 30/01/2021 19:11 IST

ఏపీ సీఎస్‌కు నిమ్మగడ్డ మరో లేఖ

విజయవాడ: గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ను కోరారు. ఈ మేరకు సీఎస్‌కు నిమ్మగడ్డ మరో లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మంత్రులు కోడ్‌ను ఉల్లంఘించకూడదని సూచించారు. అంతేకాకుండా వారి పర్యటనల్లో అధికారులు ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. అలాగే పార్టీ కార్యాలయాలకు వెళ్లే సమయంలో, అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేటప్పుడు ప్రభుత్వ వాహనాలను వాడవద్దని సూచించారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే  ప్రతి పర్యటన ఎన్నికల ప్రచారంగానే భావించాల్సి వస్తుందని ఎస్ఈసీ పేర్కొన్నారు. అధికార పర్యటనలతో ముడిపెట్టి గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థులకు ప్రచారం చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. మీడియా సమావేశాల కోసం ప్రభుత్వ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా వినియోగించకూడదని లేఖలో ఎస్ఈసీ పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

అభ్యర్థుల ధ్రువపత్రాలపై ఎస్‌ఈసీ స్పష్టత

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: ఎస్‌ఈసీ
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని