ఏకగ్రీవ ఒత్తిళ్లపై ‘షాడో’ నిఘా: నిమ్మగడ్డ

తాజా వార్తలు

Published : 30/01/2021 00:55 IST

ఏకగ్రీవ ఒత్తిళ్లపై ‘షాడో’ నిఘా: నిమ్మగడ్డ

అనంతపురం: పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై రాజకీయ ఒత్తిళ్లు చేసే వారిపై నిఘా పెట్టేలా షాడో బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. అనంతపురంలో జిల్లా కలెక్టర్‌, ఎస్పీ సహా జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎస్‌ఈసీ మీడియాతో మాట్లాడారు. షాడో బృందాల సంఖ్యను పెంచి సజావుగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అన్ని ఏకగ్రీవాలను దురుద్దేశంతో చూడలేమన్నారు. రాజకీయ పార్టీలు ఏకగ్రీవాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాయని.. వారి ఆందోళనను కూడా పరిగణనలోకి తీసుకుని గౌరవించాల్సిన అవసరముందన్నారు. ఎన్నికల నిర్వహణ పూర్తిగా రాష్ట్ర సిబ్బందితోనే జరుగుతుందని.. అందుకు తగ్గ సమర్థత సిబ్బందికి ఉందని చెప్పారు. ఎన్నికలకు కేంద్ర సిబ్బందిని రప్పించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు నిమ్మగడ్డ తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగానే జరుగుతాయని చెప్పారు.

ఇవీ చదవండి..

ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శిగా కన్నబాబుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని