శరద్‌ పవార్‌కు శస్త్రచికిత్స విజయవంతం

తాజా వార్తలు

Published : 31/03/2021 10:35 IST

శరద్‌ పవార్‌కు శస్త్రచికిత్స విజయవంతం

ముంబయి: రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌కు గాల్‌ బ్లాడర్‌ శస్త్రచికిత్స విజయవంతమైందని మహారాష్ట్ర హోంమంత్రి రాజేష్‌ తోపే తెలిపారు. వైద్యులు ఆపరేషన్‌ ద్వారా గాల్‌బ్లాడర్‌(పిత్తాశయం)లోని రాయిని తొలగించినట్లు ఆయన బుధవారం మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం పవార్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వివరించారు. ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ మాట్లాడుతూ. ‘శరద్‌ పవార్‌ పొత్తి కడుపులో నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరారు. పలు పరీక్షల అనంతరం వైద్యులు ఆయనకు ఈ రోజు శస్త్ర చికిత్స విజయవంతగా పూర్తి చేశారు. ఆయన గాల్‌బ్లాడర్‌లో ఉన్న రాయిని వైద్యులు బయటకు తీశారు’ అని తెలిపారు. కాగా, పవార్‌ను ప్రస్తుతం పరిశీలనలో ఉంచినట్లు బ్రీచ్‌కాండీ వైద్యులు వెల్లడించారు. పొత్తి కడుపులో నొప్ప కారణంగా శరద్‌పవార్‌ ఆదివారం ముంబయిలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని