పెనుబల్లిలో షర్మిల నిరుద్యోగ దీక్ష

తాజా వార్తలు

Updated : 20/07/2021 13:29 IST

పెనుబల్లిలో షర్మిల నిరుద్యోగ దీక్ష

పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చారు. వాళ్ల కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్న షర్మిల అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. వాళ్ల కష్టాలు విన్న ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

అనంతరం పెనుబల్లిలో నిరుద్యోగ నిరాహార దీక్షకు దిగారు. ముందుగా వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత దీక్షలో కూర్చున్నారు. తెలంగాణలోని నిరుద్యోగ సమస్యలపై ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టాలనే నిర్ణయంలో భాగంగా షర్మిల నిరసనకు దిగారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని