‘వందేళ్లయినా భాజపాకి అధికారం దక్కదు’

తాజా వార్తలు

Updated : 01/06/2021 15:45 IST

‘వందేళ్లయినా భాజపాకి అధికారం దక్కదు’

శరద్‌ పవార్‌, ఫడణవీస్‌ భేటీపై సంజయ్‌ రౌత్‌ స్పందన

ముంబయి: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ‘మహా వికాస్‌ అఘాడీ కూటమి’లో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలకమైన రాజకీయపక్షం. అయితే, శనివారం ఆ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో మహారాష్ట్ర ప్రతిపక్ష నేత, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, దేవేంద్ర ఫడణవీస్‌ భేటీ కావడం చర్చనీయాంశమైంది. కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని ఫడణవీస్‌ వివరణ ఇచ్చినా.. రాష్ట్రంలో మరో కూటమి ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటూ ఊహగానాలు వెల్లువెత్తాయి. కాగా.. వారిద్దరి భేటీపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తాజాగా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి సమావేశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని తెలిపారు. అలాగే, దేవేంద్ర ఫడణవీస్‌కు చురకలంటించారు.

‘‘ఆ భేటీలో మంచి ప్రతిపక్ష నేత ఎలా ఉండాలి అనే విషయంపై ఫడ్‌ణవీస్‌కు శరద్‌పవార్‌ సలహాలు ఇచ్చి ఉండొచ్చు. ఫడణవీస్‌ ఇలాంటి పనులే చేస్తే (భేటీని ఉద్దేశించి) ప్రతిపక్ష భాజపా వందేళ్లయినా మహారాష్ట్రలో అధికారంలోకి రాదు. ఆపరేషన్‌ కమలం గురించి మర్చిపోండి. అది మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో అసాధ్యం. అయినా, ప్రతి భేటీని రాజకీయ కోణంలో ఎందుకు చూస్తారు? రాష్ట్ర, ప్రజా ప్రయోజనాల విషయంలో ప్రతిపక్ష నేతగా తన పాత్ర గురించి ఫడణవీస్‌ ఆ సమావేశంలో చర్చించి ఉండొచ్చు’’అని సంజయ్‌ రౌత్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని