అమిత్‌షా బాధ్యతాయుతంగా మాట్లాడారు: శివసేన

తాజా వార్తలు

Published : 19/10/2020 02:10 IST

అమిత్‌షా బాధ్యతాయుతంగా మాట్లాడారు: శివసేన

ముంబయి: మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే మధ్య లేఖల వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించిన తీరుని శివసేన పార్టీ స్వాగతించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ మీడియాతో వెల్లడించారు.‘గవర్నర్‌, సీఎంల లేఖల వివాదాన్ని కేంద్ర హోంమంత్రి ఎంతో బాధ్యతగా మాట్లాడారు. గవర్నర్‌తో పాటు రాజ్‌భవన్‌ సైతం రాజ్యాంగ బద్ధమైనవి. కానీ గవర్నర్‌ వివాదాస్పద లేఖ రాసిన తర్వాత సీఎం తిరిగి స్పందించడం అనివార్యమైంది. అంతేకానీ ఆ వివాదాన్ని మేం ప్రారంభించలేదు. ఏదేమైనప్పటికీ ఈ విషయంలో హోంమంత్రి నిర్ణయంపై మేం సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. మా ఆగ్రహానికి కారణం అర్థం చేసుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. షా స్పందనతో ఆ వివాదాన్ని శివసేన ఇక పక్కన పెట్టింది’ అని రౌత్‌ తెలిపారు.  అదేవిధంగా శివసేన విషయంలో అమిత్‌షా సుముఖతతో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ప్రశ్నించగా రౌత్‌ వాటిని నిరాకరించారు. హోంమంత్రి మాట్లాడిన దానిలో రాజకీయాలకు సంబంధించిన అంశం ఏం లేదని.. అది కేవలం రాజ్యాంగానికి సంబంధించింది మాత్రమే అని రౌత్‌ తెలిపారు.

మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా దేవాలయాలు తెరిచే విషయమై గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ, సీఎం ఠాక్రేకు మధ్య లేఖల ద్వారా వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. సీఎం ఠాక్రేను ఉద్దేశిస్తూ.. లౌకికవాదిగా మారిపోయారా అని గవర్నర్‌ లేఖలో పేర్కొనడం దుమారం రేపింది. కాగా దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారం సీఎన్‌ఎన్‌ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. గవర్నర్‌ ఆ పదాల్ని ఉపయోగించి ఉండాల్సింది కాదని అన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని