నితీశ్‌‌కి షాకిచ్చిన భాజపా

తాజా వార్తలు

Published : 25/12/2020 15:53 IST

నితీశ్‌‌కి షాకిచ్చిన భాజపా

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు భాజపాలోకి..

ఈటానగర్: భాజపా మిత్ర పక్షం జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ) పార్టీ అధినేత నితీశ్ కుమార్‌కు పెద్ద షాకే తగిలింది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు భాజపాలోకి ఫిరాయించడమే ఇందుకు కారణం. ఈ చేరికతో 60 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో ఇప్పుడు భాజపా బలం 48కి చేరింది. ఇంతకాలం ప్రధాన ప్రతిపక్షపార్టీగా ఉన్న జేడీయూ ఒక్కస్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నెల క్రితం ఆ ఆరుగురు ఎమ్మెల్యేలకు జేడీయూ నోటీసులు ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ నాయకత్వంపై ఉన్న విశ్వాసం కారణంగానే వారు తమ పార్టీలోకి చేరారని అరుణాచల్ ప్రదేశ్ భాజపా రాష్ట్ర చీఫ్ బయూరం వ్యాఖ్యానించారు. కాగా, ఈ పరిణామంపై నితీశ్ వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్‌లో గతేడాది ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిచి, జేడీయూ గుర్తింపు పొందిన పార్టీ హోదాను దక్కించుకుంది. తాజా పరిణామాలపై జేడీయూ నేత కేసీ త్యాగి స్పందించారు. ఈ సంఘటనలతో సంబంధం లేకుండా తాము ఆ రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. స్నేహపూర్వక ప్రతిపక్షంగా కొనసాగుతామని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా..అక్టోబర్, నవంబర్ మధ్యలో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏన్డీఏని విజయం వరించినప్పటికీ..భాజపా(74 స్థానాలు) తన హవాను చూపించింది. ఆర్జేడీ, భాజపా తరవాత జేడీయూ 43 స్థానాలు గెలుచుకొని మూడో స్థానానికి పరిమితం అయింది. నితీశ్‌ కుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నప్పటికీ..కమలం పార్టీనే కీలక పాత్ర పోషిస్తోంది. 

ఇవీ చదవండి:

బండి సంజయ్‌ పర్యటనలో ఉద్రిక్తత


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని