రెచ్చగొట్టేది ఎవరు?: సోము వీర్రాజు

తాజా వార్తలు

Updated : 09/09/2020 11:23 IST

రెచ్చగొట్టేది ఎవరు?: సోము వీర్రాజు

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి దివ్యరథం దగ్ధమైన ఘటన రాష్ట్ర ప్రజల హృదయాలను కలచివేసిందని ఏపీ భాజపా అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. బుధవారం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘‘ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినా ప్రభుత్వం స్పందించలేదన్నారు.

‘‘చలో అంతర్వేదిలో పాల్గొన్న అనేక మంది యువకులు, మహిళలను అరెస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేశారని పోలీసులను ప్రశ్నిస్తే.. నినాదాలిచ్చారట!. నినాదాలు చేస్తే అరెస్టు చేస్తారా? రథం దగ్ధమై హిందువుల హృదయాలు గాయపడుతుంటే.. రెచ్చగొడుతున్నారని చెబుతారా?. రెచ్చగొట్టేది ఎవరు?. హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయో లేదో? ప్రభుత్వమే తేల్చుకోవాలి. నిన్న అరెస్టు చేసిన మహిళలు, యువకులను ఎలాంటి ఆంక్షలు లేకుండా విడుదల చేయాలి. అర్ధరాత్రి నుంచి అనేక మంది భాజపా నాయకులను గృహనిర్బంధంలో ఉంచారు. వెంటనే వారిని విడుదల చేయాలి’’ అని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని