నాలుగు సింహాల్లో ఒక్కటే ఉంది: సోము వీర్రాజు

తాజా వార్తలు

Published : 16/09/2020 10:57 IST

నాలుగు సింహాల్లో ఒక్కటే ఉంది: సోము వీర్రాజు

విజయవాడ: విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి సంబంధించిన వెండి రథానికి ముందు, వెనుక భాగాన అమర్చిన నాలుగు సింహాల ప్రతిమల్లో మూడు అదృశ్యమయ్యాయన్న విషయం బయటకురావడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు భాజపా నేతలు దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. దుర్గగుడి ఈవో సురేశ్‌బాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వెండి రథం విలువ సుమారు రూ.15లక్షల వరకు ఉంటుందని ఈవో సురేశ్‌బాబు చెప్పారు. దీన్ని బట్టి సింహం ప్రతిమల విలువ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రథానికి ఉండాల్సిన నాలుగు సింహాల్లో ఒక సింహం ప్రతిమ మాత్రమే ఉండటాన్ని గమనించాం. ఉన్న ఒక సింహం ప్రతిమ కాళ్ల వద్ద కూడా పగుళ్లు ఉన్నాయి. నాలుగు సింహాల ప్రతిమలు ఉంటే రథానికే  ఉండాలి, లేకపోతే నాలుగూ లాకరులో ఉండాలి. కానీ ఒక్కటి మాత్రమే రథానికి ఉన్నది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. అత్యంత ప్రాధాన్యత ఉన్న రథానికి భద్రత ఎందుకు ఏర్పాటు చేయలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపించి పూర్తి వివరాలు వెల్లడించాలి’’ అని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని