‘అసమ్మతి’ సమావేశానికి రాహుల్, ప్రియాంక!
close

తాజా వార్తలు

Updated : 18/12/2020 14:44 IST

‘అసమ్మతి’ సమావేశానికి రాహుల్, ప్రియాంక!

వెల్లడించిన కాంగ్రెస్ వర్గాలు

దిల్లీ: 23 మంది కాంగ్రెస్‌ అసమ్మతి నేతలతో శనివారం సమావేశమయ్యేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. కాగా, ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా కూడా హాజరుకానున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకత్వం, వ్యవస్థాగత నిర్మాణంలో మార్పులు అవసరమంటూ కొద్ది నెలల క్రితం కొందరు కాంగ్రెస్ సీనియర్లు లేఖ రూపంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ లేఖపై అంతర్గతంగా చర్చించిన అనంతరం ఈ సమావేశానికి సోనియా అంగీకరించడాన్ని సయోధ్య దిశగా ముందడుగని ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అసమ్మతి నేతలతో పాటు లేఖలో సంతకం చేయని ఇతర నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని వెల్లడించాయి. నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 23 కాంగ్రెస్‌ సీనియర్లు రాసిన లేఖ ఆగస్టులో వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ చొరవ తీసుకొని సీనియర్లతో సమావేశానికి సోనియాను ఒప్పించినట్లు తెలుస్తోంది. 

కాంగ్రెస్‌కు కొత్త నాయకత్వం దిశగా అడుగులు.. 2021లో కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటములకు బాధ్యత వహించి అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేయడంతో సోనియా తాత్కాలికంగా ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి కీలక రాష్ట్రాలైన కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. రాజస్థాన్‌లో కూడా సచిన్ పైలెట్ రూపంలో ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ, ప్రస్తుతానికి అవి సర్దుమణిగాయి. తిరుగుబాటుదారుల సహకారంతో భాజపా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరపరాభవాన్ని జీర్ణించుకోలేని సీనియర్ నేత కపిల్ సిబల్ పార్టీ వైఖరిపై తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. పార్టీలో సమీక్ష అవసరమంటూ చిదంబరం వంటి నాయకులు సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్లతో సోనియా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఇవీ చదవండి:

సీఎం అశోక్ గహ్లోత్‌కు మరో షాక్‌!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని