AP news: విశాఖ స్టీల్‌పై రాష్ట్రవ్యాప్త పోరాటం!

తాజా వార్తలు

Updated : 09/07/2021 12:09 IST

AP news: విశాఖ స్టీల్‌పై రాష్ట్రవ్యాప్త పోరాటం!

కార్యాచరణ రూపొందిస్తామన్న నారాయణ

కూర్మన్నపాలెం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్న పాలెం జంక్షన్‌ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 147వ రోజుకు చేరాయి. ఇవాళ దీక్షా శిబిరాన్ని సీపీఐ నేత నారాయణ సందర్శించి సంఘీభావం తెలిపారు. విశాఖ ఉక్కు పోరాటంలో విద్యార్థి దశలోనే పాల్గొన్నానని అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించి విశాఖ ఉక్కును కాపాడాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు అన్యాయం జరుగుతుంటే.. మాజీ ఎంపీ హరిబాబు స్పందించరా? అని నారాయణ ప్రశ్నించారు. నిజంగా విశాఖపై ప్రేమ ఉంటే మిజోరం గవర్నర్‌ పదవి తిరస్కరించాలన్నారు. ఏ పోరాటానికైనా సీపీఐ సిద్ధంగా ఉందనీ, అన్ని పార్టీలూ స్పందించాలని కోరారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యక్ష పోరాటం చేయాలన్నారు. సీఎం జగన్‌ నేరుగా ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్‌ చేశారు. ‘‘ విజయసాయిరెడ్డి తలచుకుంటే సమస్య పరిష్కరించగలరు. ఈ నెల 12న విజయవాడలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేస్తాం. రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం’’ అని నారాయణ అన్నారు.
 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని