Raghurama: వైద్యపరీక్షల నివేదిక అందింది: సుప్రీం

తాజా వార్తలు

Published : 22/05/2021 01:32 IST

Raghurama: వైద్యపరీక్షల నివేదిక అందింది: సుప్రీం

దిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్‌, వైద్యపరీక్షల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి వైద్యులు అందించిన నివేదిక తమకు అందిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వినీత్‌ శరన్‌ చెప్పారు. వైద్య పరీక్షల నివేదికను ఆయన తెరిచారు. ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్‌రే, వీడియో కూడా పంపారని తెలిపారు. రఘురామకృష్ణరాజుకు జనరల్‌ ఎడిమా ఉందని.. కాలి వేలికి ఫ్రాక్చర్‌తో పాటు మరికొన్ని గాయాలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారని జస్టిస్‌ వినీత్‌ శరన్‌ అన్నారు. 

మా ఆరోపణలు నిజమని తేలాయి: ముకుల్‌ రోహత్గీ

కస్టడీలో చిత్రహింసలు పెట్టారన్న తమ ఆరోపణలు నిజమని తేలాయని రఘురామ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ అన్నారు. ఏపీ సీఐడీ అధికారుల చిత్రహింసలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. సిట్టింగ్‌ ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుడి పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే స్పందిస్తూ రఘురామే స్వయంగా చేసుకున్న గాయాలా? కాదా? అన్నది తెలియదన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లే ముందు స్వయంగా గాయాలు చేసుకున్నారని అంటున్నారా? అని ధర్మాసనం న్యాయవాది దవేను ప్రశ్నించింది. వైద్య పరీక్షల నివేదికను ఏపీ ప్రభుత్వం, న్యాయవాదులకు మెయిల్ చేస్తామని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30గంటలకు వాయిదా వేసింది.

 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని