వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెనుమత్స తనయుడు

తాజా వార్తలు

Published : 11/08/2020 20:18 IST

వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెనుమత్స తనయుడు

అమరావతి: వైకాపా నేత మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. ఈ నెలలోనే ఆ స్థానం భర్తీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వైకాపా తమ ఎమ్మెల్సీ అభ్యర్థిని తాజాగా ఖరారు చేసింది. పార్టీ తరఫున పోటీగా ఇటీవల మృతి చెందిన మాజీ మంత్రి.. వైకాపా సీనియర్‌ నేత పెనుమత్స సాంబశివరావు తనయుడు, విజయనగరం జిల్లా మొయిదాకు చెందిన సురేశ్‌బాబును దింపాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. 

ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్‌ దాఖలుకు ఈనెల 13 ఆఖరి తేదీ. తొలుత వేరొకరి పేరును జగన్‌ అనుకున్నా.. తొలి నుంచి వైకాపాతో ఉన్న పెనుమత్స కుటుంబానికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో జగన్‌ మనసు మార్చుకుని సురేశ్‌బాబు పేరును ఖాయం చేశారు. ఈనెల 24న ఎన్నిక జరగాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఈ స్థానం సంఖ్యాపరంగా వైకాపాకు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని