దీదీ.. ఆ లెటర్‌ ప్యాడ్‌లు ప్రింట్‌ చేయించుకోండి! 

తాజా వార్తలు

Published : 30/03/2021 01:03 IST

దీదీ.. ఆ లెటర్‌ ప్యాడ్‌లు ప్రింట్‌ చేయించుకోండి! 

మమతకు సువేందు అధికారి సలహా

అసదాల: నందిగ్రామ్‌ నుంచి భాజపా తరఫున బరిలో నిలిచి దీదీకి గట్టి సవాల్‌ విసురుతున్న సువేందు అధికారికి అసదాల నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్‌ని టీఎంసీ జెండాలు పట్టుకొన్న కొందరు కార్యకర్తలు ముట్టడించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనపై సువేందు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ప్రత్యేకించి ఒక వర్గానికి చెందిన వారి పనేనన్నారు. ఇక్కడి పోలీసులు ఇంకా మమతా బెనర్జీ రాజకీయంగా సజీవంగానే ఉన్నారని, ఎన్నికల సంఘం దిల్లీలో మౌనంగా కూర్చొంటుందని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ మురికి భాషను వాడుతున్నారని, ఆమె మాటలకు తాను స్పందించబోనన్నారు.

దీదీ ఓటమితో పారిపోవడం ఖాయం

మమత వ్యాఖ్యల ప్రభావం ఇక్కడ ఎలాంటి ప్రభావం చూపబోదని సువేందు తెలిపారు. ఆమెకు ప్రజలు తగిన రీతిలో సమాధానం చెబుతారన్నారు. ఎన్నికల్లో ఓటమిపాలై పారిపోవడంలో దీదీ చరిత్ర సృష్టిస్తారంటూ ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యేగా లెటర్‌ ప్యాడ్‌లు ప్రింట్‌ చేయించుకోవాలంటూ మమతకు సలహా ఇచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని