ఓటుకు ‘డిజిటల్‌’ నోటు
close

తాజా వార్తలు

Updated : 03/04/2021 13:31 IST

ఓటుకు ‘డిజిటల్‌’ నోటు

ఓటర్ల ఫోన్‌ నంబర్లు సేకరిస్తూ చెల్లింపులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: డబ్బులు వెదజల్లి ఓటర్లను కొనడం ఈరోజుల్లో పరిపాటిగా మారింది. అయితే ఈ డిజిటల్‌ యుగంలో అది కొత్తపుంతలు తొక్కుతోంది. ఇంతకముందులా ఇంటికొచ్చి నోట్లు పంచడం కాకుండా మొబైల్‌ నంబర్‌ ఇస్తే చాలు ఓటర్ల అకౌంట్‌లోకే డబ్బులు బదిలీ చేస్తున్నారు రాజకీయ నేతలు. ఇంటింటి ప్రచారం పేరిట రాజకీయ నాయకులు చేస్తున్నదల్లా మొబైల్‌ నంబర్ల సేకరణే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ నంబర్ల సేకరణ కోసం కూడా ప్రత్యేకంగా ఏజెన్సీలు పెట్టుకున్న అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇలాంటి ఘటనలపైనే తమిళనాడులో విపక్ష డీఎంకే.. అధికార అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థిపై ఈసీకి లేఖ రాసింది. 

తొండముత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి ఎస్పీ వేలుమణి ఓటర్ల ఫోన్‌ నంబర్లు సేకరించి గూగుల్‌ పే సహా ఇతర డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ల ద్వారా వారికి చెల్లింపులు చేస్తున్నారన్నది ఆ ఫిర్యాదు సారాంశం. డీఎంకే ఆరోపణలను అన్నాడీఎంకే తోసిపుచ్చింది. ఓటమి ఖాయమని అర్థమైన విపక్ష డీఎంకే ఇలాంటి తప్పుడు ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదులు చేస్తోందని పేర్కొంటోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఎలా ఉన్నా డిజిటల్‌ పేమెంట్లు జరుగుతున్నాయో, లేదో ఓటర్లకు మాత్రం తెలుసు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని