రేపు, ఎల్లుండి తెదేపా మాక్‌ అసెంబ్లీ: టీడీఎల్పీ

తాజా వార్తలు

Updated : 19/05/2021 18:14 IST

రేపు, ఎల్లుండి తెదేపా మాక్‌ అసెంబ్లీ: టీడీఎల్పీ

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా మాక్‌ అసెంబ్లీ నిర్వహించాలని తెదేపా శాసనసభాపక్షం (టీడీఎల్పీ) నిర్ణయించింది. ఈ మేరకు తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెదేపా శాసనసభాపక్షం భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ రెండు రోజులు పాటు మాక్‌ అసెంబ్లీ జరపాలని నిర్ణయించారు. రేపు (గురువారం) సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 8గంటల వరకు; అలాగే, ఎల్లుండి (శుక్రవారం) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు  మాక్‌ అసెంబ్లీ నిర్వహించనున్నట్టు టీడీఎల్పీ వెల్లడించింది.  మరోవైపు, ఈ నెల 20 నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని