ఏపీలో ఇసుక దొరకని పరిస్థితి:అచ్చెన్న

తాజా వార్తలు

Updated : 24/03/2021 12:10 IST

ఏపీలో ఇసుక దొరకని పరిస్థితి:అచ్చెన్న

అమరావతి: ఏపీలో వైకాపా ప్రభుత్వం క్విడ్‌ ప్రోకోలో భాగంగానే ఇసుకను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టిందని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రకృతి సంపద పేదలకు అందని పరిస్థితి రావడం బాధాకరమన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థకు లబ్ధి చేకూరేలా ఇసుకను ఎలా కట్టబెడతారని ఆయన ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలో పేదవాడికి ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. ప్రజల సంపదను జగన్‌ ప్రభుత్వం ప్రైవేటు వాళ్లకి అప్పగించింది. అధికార పార్టీతో సంబంధం ఉన్న, నష్టాల్లో ఉన్న సంస్థకు ఇసుకను కట్టబెట్టారు. గతంలో ఇసుక విరివిగా ఉందన్న ప్రభుత్వం ఇప్పుడు కొరత ఉందని అబద్ధాలు ప్రచారం చేస్తోంది’’ అని అచ్చెన్నాయుడు విమర్శించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని