AP news: ‘సాధన దీక్ష’ పేరుతో ఆందోళనలు 

తాజా వార్తలు

Updated : 28/06/2021 18:09 IST

AP news: ‘సాధన దీక్ష’ పేరుతో ఆందోళనలు 

అమరావతి: కొవిడ్‌ బాధితులను ఆదుకోవాలనే డిమాండ్‌తో ‘సాధన దీక్ష’ పేరుతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు తెదేపా పిలుపునిచ్చింది. ఈ మేరకు  అమరావతిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబుఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఆయనతోపాటు 15 మంది పార్టీ సీనియర్‌ నేతలు ఈ దీక్షలో పాల్గొననున్నారు.

ఆ ఫలాలు ఇప్పుడు అందుతున్నాయ్‌: చంద్రబాబు

అమరావతిని దక్షిణభారతదేశ విద్యాకేంద్రంగా మార్చాలనేది తమ విజన్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆ విజన్‌ ఫలాలు ఇప్పుడు అందుతున్నాయని చెప్పారు. అమరావతి ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులు ఏడాదికి రూ.50 లక్షల వేతనం వచ్చే ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు. ఇక్కడి విద్యార్థులు ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందారని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని