CBN: ప్ర‌శ్నిస్తే దాడుల‌కు దిగుతున్నారు..    

తాజా వార్తలు

Updated : 22/05/2021 13:54 IST

CBN: ప్ర‌శ్నిస్తే దాడుల‌కు దిగుతున్నారు..    

 

అమ‌రావ‌తి: నిబంధ‌న‌లు ఉల్లంఘించిన అన్ని అంశాల్లో ఏపీ ప్ర‌భుత్వానికి కోర్టుల్లో ఎదురు దెబ్బ‌లు తగులుతున్నాయ‌ని తెదేపా అధినేత చంద్ర‌బాబు అన్నారు. జూమ్ యాప్ ద్వారా మీడియా స‌మావేశం నిర్వ‌హించిన ఆయ‌న మాట్లాడుతూ.. ప‌రిష‌త్ ఎన్నిక‌ల పోలింగ్‌కు సంబంధించి నాలుగు వారాల ముందు నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని సుప్రీం కోర్టు ఆదేశించింద‌న్నారు. అయినా.. కొత్త ఎస్ఈసీని తీసుకొచ్చి ఆగమేఘాల మీద ఎన్నిక‌లు నిర్వ‌హించార‌న్నారు. నామినేష‌న్లు స‌రిగా ఉన్న‌వారిని కూడా తిర‌స్క‌రించార‌ని తెలిపారు. అహంభావంతో ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హ‌స్యం చేశార‌న్నారు. ప్ర‌శ్నించిన అంద‌రిపై దాడుల‌కు దిగుతున్నార‌ని ఆయ‌న‌ ఆక్షేపించారు. 

ర‌ఘురామ‌కృష్ణ‌రాజును పోలీసులు వేధించార‌ని సుప్రీంలో తేలింద‌ని చంద్ర‌బాబు అన్నారు. ప్ర‌భుత్వ క‌స్ట‌డీలో ఉన్న‌వారికి ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను వేధించి మాన‌సిక క్షోభ‌కు గురి చేశార‌ని మండిప‌డ్డారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని