CBN: వారిపై చిన్నచూపు త‌గ‌దు: చంద్ర‌బాబు

తాజా వార్తలు

Updated : 08/06/2021 14:59 IST

CBN: వారిపై చిన్నచూపు త‌గ‌దు: చంద్ర‌బాబు

స్నేహపూర్వక పోలీసింగ్‌ అమలయ్యేలా చూడండి

 గ‌వ‌ర్న‌ర్‌కు తెదేపా అధినేత లేఖ‌

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో స్నేహ‌పూర్వ‌క పోలీసింగ్ అమ‌ల‌య్యేలా చొర‌వ చూపాల‌ని గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌కు తెదేపా అధినేత చంద్ర‌బాబు నాయుడు కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. క‌రోనా వేళ ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌, సామాన్య ప్ర‌జ‌ల‌ను అర్థం లేని వేధింపుల‌కు గురి చేస్తున్న పోలీసులు, ఇత‌ర అధికారుల‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరారు. వైకాపా ప్ర‌భుత్వంలో ఓ వ‌ర్గం పోలీసులు ప్ర‌జాస్వామ్య విధానాల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చంద్ర‌బాబు లేఖ‌లో పేర్కొన్నారు. 
గ‌తేడాది విశాఖ‌లో ఎస్సీ వ‌ర్గానికి చెందిన‌ వైద్యుడు సుధాక‌ర్‌కు జ‌రిగిన అన్యాయాన్ని మ‌రువ‌క ముందే అదే న‌గ‌రంలో మ‌రో ఎస్సీ యువ‌తి ప‌ట్ల పోలీసుల‌ వేధింపులు వెలుగులోకి వ‌చ్చాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. క్లిష్ట ప‌రిస్థితుల్లో విధులు నిర్వ‌ర్తిస్తున్న వారిపై ప్ర‌భుత్వానికి చిన్న‌చూపు త‌గ‌ద‌ని చంద్ర‌బాబు హితవు ప‌లికారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని