ప్రాజెక్టులకు బడ్జెట్ పెంచాలి: చంద్రబాబు

తాజా వార్తలు

Updated : 07/07/2021 16:18 IST

ప్రాజెక్టులకు బడ్జెట్ పెంచాలి: చంద్రబాబు

అమరావతి: కరోనా సమయంలో రైతులను ఆదుకోవడంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విఫలమయ్యారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. రైతులకు పంట బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని.. మోటార్లకు మీటర్లు బిగించే పథకం రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలో ఏ పంటకూ మద్దతు ధర లభించడం లేదన్నారు. రైతు భరోసా కింద రాష్ట్ర నిధుల నుంచి ఒక్కో రైతుకు రూ. 13,500 ఇస్తామని చెప్పి రూ.7,500 మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలోనూ పూర్తిగా విఫలమయ్యారన్నారు.

రాయలసీమలో రాయితీపై పంపిణీ చేసే డ్రిప్, యంత్ర పరికరాలను నిలిపివేశారని చంద్రబాబు మండిపడ్డారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో నిలవడం సీఎం జగన్ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకుంటూనే సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్ పెంచాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా, గోదావరి నీటి హక్కులను తాకట్ట పెట్టకుండా కాపాడాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని