CBN: సుప్రీం ఆదేశాల‌కు విరుద్ధంగా అరెస్టులు

తాజా వార్తలు

Published : 19/05/2021 16:19 IST

CBN: సుప్రీం ఆదేశాల‌కు విరుద్ధంగా అరెస్టులు

డీజీపీ స‌వాంగ్‌కు తెదేపా అధినేత చంద్ర‌బాబు లేఖ‌

అమ‌రావ‌తి: అరెస్టుల‌తో ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌శ్నించే వారి గొంతు నొక్కుతోంద‌ని తెదేపా అధినేత చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. నోటీసులు ఇవ్వ‌కుండానే గుంటూరు అరండ‌ల్‌పేట్ పోలీసులు తెదేపా కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశార‌న్నారు. ఈ మేర‌కు చంద్ర‌బాబు డీజీపీ గౌతమ్‌స‌వాంగ్‌కు లేఖ రాశారు. అరెస్టు చేసిన కార్య‌కర్త‌ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. ఏపీలో సుప్రీంకోర్టు ఆదేశాల‌కు విరుద్ధంగా అరెస్టులు జ‌రుగుతున్నాయ‌ని లేఖ‌లో పేర్కొన్నారు. అధికార పార్టీని ప్ర‌శ్నించే వారిపై అక్ర‌మంగా కేసులు పెడుతున్నార‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని