మందుపాతరలకే భయపడలేదు: చంద్రబాబు
close

తాజా వార్తలు

Updated : 13/04/2021 16:48 IST

మందుపాతరలకే భయపడలేదు: చంద్రబాబు

తిరుపతి: కొత్త ఏడాదిలో సమస్యలకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఏదీ శాశ్వతం కాదనేది తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలతో నిరూపితమవుతుందని చెప్పారు. ఉగాది సందర్భంగా తిరుపతిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇవాళ జరిగిన పంచాంగ శ్రవణం తర్వాత చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర సమస్యలపై పోరాడి.. ప్రజలను కాపాడుకునే బాధ్యత తెదేపాపై ఉందన్నారు. ‘‘ తిరుపతి అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమైంది. నా సభపై రాళ్లు వేస్తారా?మందుపాతరలకే భయపడేది లేదు.. గులకరాళ్లకు జంకుతానా? తిరుపతిలో శాంతిభద్రతలకు ఆటంకం ఏర్పడితే తిరుమలపైనా ప్రభావం ఉంటుంది. చెప్పుకోవడానికి ఏమీ లేకనే వైకాపా తెదేపాపై దాడులు చేస్తోంది. తిరుపతి తెదేపాకు కంచుకోట. 1983 నుంచి తిరుపతిలో ఎక్కువసార్లు తెదేపాదే విజయం’’ అని చంద్రబాబు అన్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని