చలో ప్రగతిభవన్‌: విపక్ష నేతలు అరెస్టు

తాజా వార్తలు

Updated : 07/08/2020 14:53 IST

చలో ప్రగతిభవన్‌: విపక్ష నేతలు అరెస్టు

హైదరాబాద్‌: కరోనా కట్టడిలో రాష్ర్ట ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నించిన విపక్ష నేతలను ఎక్కడికక్కడే పోలీసులు అరెస్టు చేశారు. సీఎం క్యాంపు కార్యాలయానికి బయలుదేరిన పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచే ఆయా పార్టీల ముఖ్యనేతల ఇళ్లతో పాటు ప్రగతి భవన్‌ వద్ద పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు.

ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణను అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రగతి భవన్‌ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న తెజస అధ్యక్షుడు కోదండరామ్‌, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, న్యూ డెమోక్రసీ నేతలు గోవర్థన్‌, సంధ్య, కమ్యూనిస్టు, యువజన, ప్రజాసంఘాల కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళన కారుల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని