రాయలసీమ ప్రయోజనాలను తాకట్టుపెట్టారు: కాల్వ

తాజా వార్తలు

Updated : 09/07/2021 14:56 IST

రాయలసీమ ప్రయోజనాలను తాకట్టుపెట్టారు: కాల్వ

అనంతపురం: రెండేళ్ల వైకాపా పాలనలో రాయలసీమకు సీఎం జగన్‌ చేసిందేమీ లేదని తెదేపా సీనియర్‌నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. సీఎం అసమర్థత వల్ల పోలవరం నిర్మాణం కూడా పూర్తి చేయలేకపోతున్నారని విమర్శించారు. హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు పార్థసారథితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు.

‘‘చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఆక్షేపణీయం. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే తెలంగాణలోని పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిసేలా కృషి చేశారు. అందువల్లనే పోలవరం నిర్మాణం సాఫీగా సాగిపోతోంది. అయితే, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రస్తుతం పోలవరం నిర్మాణం పూర్తి చేయలేకపోతున్నారు. జగన్‌ ఉన్నంత వరకు గ్రావిటీ ద్వారా నీరు పారించే పరిస్థితి లేదు’’ అని కాల్వ అన్నారు.

ఎన్నికలకు ముందు కేసీఆర్‌తో చేసుకున్న రహస్య ఒప్పందంతోనే రాయలసీమ ప్రయోజనాలు తాకట్టుపెట్టారని ఆరోపించారు. తెదేపా ఐదేళ్ల పాలనలో రూ.8వేల కోట్లకు పైగా హంద్రీనీవాకు ఖర్చు చేశామనీ,  వైకాపా అధికారంలోకి వచ్చాక ఎంత ఖర్చు పెట్టారో చెప్పే ధైర్యం ఆ పార్టీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. అసమర్థత కప్పిపుచ్చుకునేందుకే జల వివాదాల నాటకాలు ఆడుతున్నారని కాల్వ ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని