ఇప్పటికైనా చట్టాలను గౌరవించాలి: అశోక్‌ గజపతి
close

తాజా వార్తలు

Updated : 14/06/2021 15:35 IST

ఇప్పటికైనా చట్టాలను గౌరవించాలి: అశోక్‌ గజపతి

విజయనగరం (రింగురోడ్డు): ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవించాలని కేంద్ర మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు సూచించారు. మాన్సాస్‌, సింహాచలం ట్రస్టు ఛైర్‌పర్సన్‌గా సంచయిత నియామక జీవోను కొట్టివేసి అశోక్‌ గజపతిని పునర్నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని  రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివాదం జరిగి చాలా రోజులైందని.. ఎక్కడెక్కడ నష్టం జరిగిందో చూడాల్సిన అవసరముందన్నారు. సింహాచలం ట్రస్టు పరిధిలోని ఆలయాల్లో పరిస్థితులను పరిశీలించాల్సి ఉందని చెప్పారు. 

ఈ విషయంలో ప్రభుత్వం ఎంత వరకు సహకరిస్తుందనేది చూడాలన్నారు. రామతీర్థం ఆలయానికి తాను విరాళం ఇస్తే దాన్ని తిప్పి పంపారన్నారు. తాను ఛైర్మన్‌గా ఉన్నప్పుడు అక్రమాలు జరిగాయని వాదించారని.. ఎలాంటి నష్టం జరిగిందో చెప్పలేకపోయారని అశోక్‌ గజపతి అన్నారు. అధికారులు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలని కోరారు. మాన్సాస్‌ ప్రజల కోసం పుట్టిన సంస్థ అని.. తనపై పగతో ఆ కార్యాలయాన్ని తరలించారని ఆక్షేపించారు. తనను ఇబ్బంది పెట్టేందుకు సామాన్యులు, ఉద్యోగులు, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేశారని ఆయన ఆరోపించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని