AP News: ఆ హక్కు ప్ర‌భుత్వానికెక్క‌డిది?: ఉమ‌

తాజా వార్తలు

Updated : 05/06/2021 13:45 IST

AP News: ఆ హక్కు ప్ర‌భుత్వానికెక్క‌డిది?: ఉమ‌

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ పాడి ప‌రిశ్ర‌మ‌ను అమూల్ సంస్థ‌కు ధారాదత్తం చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్క‌డిద‌ని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్ర‌శ్నించారు. తెదేపా సీనియ‌ర్ నేత, సంగం డెయిరీ ఛైర్మ‌న్ ధూళిపాళ్ల న‌రేంద్ర‌ను ప‌రామ‌ర్శించిన ఆయ‌న అనంత‌రం మీడియాతో మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో అమూల్‌ను వ్య‌తిరేకించారని.. ఈ సంస్థ వ‌ల్ల రాష్ట్రానికి పెట్టుబ‌డులు రావ‌ని తెలిపారు. మిల్ల‌ర్ల‌తో స‌జ్జల కుమ్మ‌క్కై దోచుకుంటున్నార‌ని ఆరోపించారు. కోర్టు తీర్పుల‌తోనైనా వైకాపా నాయ‌కుల్లో మార్పు రావ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు. 

అమూల్‌ పాల సేకరణ, వ్యాపార అవసరాల కోసం ఏ విధమైన సొమ్మూ ఖర్చు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు నిన్న‌ కీలక ఉత్తర్వులిచ్చింది. అమూల్‌ డెయిరీ ఎండీ, నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ) ఛైర్మన్‌, ఒంగోలులోని ప్రకాశం మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (పీఎంపీసీఎల్‌) ఎండీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14కు లోపు రాష్ట్రంలో అమూల్‌ సంస్థ పాల సేకరణ, మార్కెటింగ్‌ అవసరాల కోసం.. రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ, అమూల్‌ డెయిరీ మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ఆధారంగా ఏ విధమైన సొమ్మునూ ఖర్చు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విష‌యం తెలిసిందే. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని