అమరావతిపై భాజపా వైఖరేంటి?: అయ్యన్న

తాజా వార్తలు

Published : 10/08/2020 01:03 IST

అమరావతిపై భాజపా వైఖరేంటి?: అయ్యన్న

విశాఖపట్నం: అమరావతిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత భాజపాపైనా ఉందని తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతికి అనుకూలమని భాజపా భావిస్తుందా? అని ప్రశ్నించారు. కేంద్రం జోక్యం చేసుకునేలా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర భాజపాదేనని చెప్పారు. అమరావతి అంశంలో ద్వంద్వ వైఖరి సరికాదని హితవు పలికారు. ప్రజారోగ్యం కంటే రాజకీయాలకే మంత్రులు ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. అమరావతి తరలింపు కూడా రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. మరోవైపు విష జ్వరాలు ప్రబలుతున్నారని చెప్పారు. విష జ్వరాలపై మంత్రులు, కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు స్పందించట్లేదని అయ్యన్న పాత్రుడు తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని