ఏపీ సీఎం నోరు విప్పలేని స్థితిలో ఉన్నారా?

తాజా వార్తలు

Updated : 06/07/2021 14:42 IST

ఏపీ సీఎం నోరు విప్పలేని స్థితిలో ఉన్నారా?

జేసీ ప్రభాకర్‌ రెడ్డి

అనంతపురం: తెలంగాణ మంత్రులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిని తిడుతున్నా ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నోరు విప్పలేని పరిస్థితిలో ఉన్నారా? అంటూ తెదేపా నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి ప్రశ్నించారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో తెదేపా సర్పంచ్‌లతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సెటిలర్స్‌ను బూచిగా చూపి.. జగన్‌ తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకుంటున్నారని ప్రభాకర్‌రెడ్డి ఆక్షేపించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై గట్టిగా మాట్లాడకపోతే ఎవరు లెక్క చేస్తారని అన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు గాజులు తొడుక్కున్నారా?అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని