AP news: తెదేపా నేత కొల్లు రవీంద్ర అరెస్టు

తాజా వార్తలు

Published : 10/07/2021 14:43 IST

AP news: తెదేపా నేత కొల్లు రవీంద్ర అరెస్టు

మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. మచిలీపట్నం చింతచెట్టు సెంటర్‌లో మున్సిపల్‌ అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. తెదేపా సానుభూతిపరుల దుకాణాలు తొలగిస్తున్నారంటూ బాధితులకు కొల్లు రవీంద్ర మద్దతుగా నిలిచారు. ఘటనాస్థలిలోనే బైఠాయించడంతో తెదేపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని