‘అమ్మఒడి వద్దు.. ఆక్సిజన్‌ ఇమ్మంటున్నారు’
close

తాజా వార్తలు

Published : 13/05/2021 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అమ్మఒడి వద్దు.. ఆక్సిజన్‌ ఇమ్మంటున్నారు’

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జ‌లు అమ్మ ఒడికి బ‌దులు ఆక్సిజ‌న్ ఇవ్వమంటున్నార‌ని తెదేపా నేత న‌క్కా ఆనంద‌బాబు తెలిపారు. వ‌స‌తిదీవెన వ‌ద్దు ఆస్ప‌త్రిలో వ‌స‌తి క‌ల్పించ‌మంటున్నార‌ని స్ప‌ష్టం చేశారు.  రేప‌టికి బ‌తుకుతామ‌నే భ‌రోసా కల్పించ‌మంటున్నార‌ని ఆయ‌న చెప్పారు. ఇంటింటికి రేష‌న్ బ‌దులు వ్యాక్సిన్ ఇవ్వ‌మని ప్ర‌జ‌లు కోరుతున్నార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకే చంద్ర‌బాబుపై కేసులు పెడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 

సీఎం జ‌గ‌న్ త‌న వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకోవ‌డానికి ఇత‌రుల‌పై నింద‌లు వేయ‌డం స‌రికాద‌ని గుంటూరు జిల్లా తెదేపా అధ్య‌క్షుడు జీవీ ఆంజ‌నేయులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ''వ్యాక్సిన్ త‌యారీ సంస్థ‌ల‌కు కులం ఆపాదించ‌డం సిగ్గుచేటు. టీకాల‌కు సంబంధించి ముంద‌స్తు చెల్లింపులు, ఆర్డ‌ర్లు పెట్ట‌కుండా లేఖ‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.1,600 కోట్ల‌కు గానూ రూ.45 కోట్లే మంజూరు చేస్తారా?  కుల రాజ‌కీయాల‌తో ప్ర‌జ‌ల‌ను త‌ప్పు దోవ ప‌ట్టిస్తున్నారు.  ఇత‌ర రాష్ట్రాల‌కు లేని ఇబ్బందులు ఏపీకే ఎందుకొచ్చాయి'' అని ఆయ‌న మండిప‌డ్డారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని