‘చంద్రబాబు పేరు చరిత్రలో ఉండొద్దనే విధ్వంసం’

తాజా వార్తలు

Published : 07/08/2020 02:53 IST

‘చంద్రబాబు పేరు చరిత్రలో ఉండొద్దనే విధ్వంసం’

అమరావతి: నవ్యాంధ్ర రాజధానిపై జగన్‌ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ విమర్శించారు. రాజధాని అంశంపై ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ప్రపంచానికే తలమానిక రాజధాని నిర్మిస్తానని చెప్పి.. గొప్ప లక్ష్యంతో కట్టిన రాజధానిని ఎందుకు ధ్వంసం చేస్తున్నారని నిలదీశారు. మీరు అనుకున్న దానికంటే గొప్పగా కట్టారనే కూలగొడుతున్నారా? అని జగన్‌ను ప్రశ్నించారు. ‘‘అమరావతి నిర్మాతగా చంద్రబాబు పేరు చరిత్రలో ఉండకూడదనే మూడు ముక్కలాటతో విధ్వంసం సృష్టిస్తున్నారా?ఐదు కోట్ల ఆంధ్రులకు మీరు సమాధానం చెప్పి తీరాలి’’ అని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ అమరావతి సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని కోరారు. ఆర్టికల్‌ 355(సీ) మేరకు కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. రైతులను, రాష్ట్రాన్ని గట్టెక్కించాల్సింది కేంద్రమేనని చెప్పారు. రాజధాని రైతులకు సహకరిస్తామని భాజపా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని