కలిసి పోరాడదాం.. ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుందాం: తెదేపా

తాజా వార్తలు

Published : 02/08/2021 16:15 IST

కలిసి పోరాడదాం.. ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుందాం: తెదేపా

దిల్లీ: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దిల్లీలో జరుగుతున్న ఆందోళనకు తెదేపా ఎంపీలు మద్దతు పలికారు. జంతర్‌మంతర్‌ వెళ్లి ఉక్కు కార్మికులకు ఎంపీ గల్లా జయదేవ్‌, కనకమేడల మద్దతు తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా పార్లమెంటు లోపల, బయట పోరాటం చేస్తామన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు పార్టీలన్నీ కలిసి పోరాడాలన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమకారులకు మా పార్టీ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.

అంతకు ముందుకు వైకాపా ఎంపీలు విజయసాయి రెడ్డి, మిధున్‌రెడ్డి జంతర్‌మంతర్‌ వెళ్లి ఉక్కు ఆందోళన కారులకు మద్దతు తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఎన్నో పోరాటాలతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వచ్చిందని అన్నారు. దీని వెనుక ఎంతో చరిత్ర ఉందని చెప్పారు. ‘‘ 1991లో ఉత్పత్తి మొదలు పెట్టారు. ఆ తర్వాత దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారంగా అవతరించింది. 15వేల మంది పర్మినెంట్‌ ఉద్యోగులు, 17వేల మంది కాంట్రాక్‌ ఉద్యోగులు 70వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని ప్రైవేటీకరించేందుకు మనం ఒప్పుకోకూడదు. రాజకీయాలకు అతీతంగా, మన గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుమేరకు మనమంతా పోరాటం చేయాలి’’ అని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ విషయంలో ఉద్యమకారులతోపాటు కలిసి నడుస్తామని, పోరాటం సాగిస్తామని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని