వారికి జ్ఞానం ప్రసాదించాలని వేడుకున్నా: అశోక్‌ గజపతి
close

తాజా వార్తలు

Updated : 15/06/2021 13:56 IST

వారికి జ్ఞానం ప్రసాదించాలని వేడుకున్నా: అశోక్‌ గజపతి

విజయనగరం: రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు జ్ఞానం ప్రసాదించాలని పైడితల్లి అమ్మవారిని వేడుకున్నట్లు తెదేపా సీనియర్‌ నేత, మాన్సాస్‌ ట్రస్టు మాజీ ఛైర్మన్ అశోక్‌ గజపతిరాజు అన్నారు. మాన్సాస్‌ ట్రస్టు, సింహాచలం దేవస్థానం ఛైర్‌పర్సన్‌గా సంచైత నియామకం చెల్లదంటూ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. 

అనంతరం అశోక్‌ గజపతిరాజు మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల కాలంలో ఎన్నో అలజడులు సృష్టించారని.. తనపై కక్ష గట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలం గోశాలలో గోవులను హింసించి చంపేశారని.. మాన్సాస్‌ సంస్థను అనేక రకాలుగా నష్టపరిచారని ఆరోపించారు. ట్రస్టు ఆధ్వర్యంలోని 105 ఆలయాల్లో ఏమేం జరిగాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని