లేఖలు రాస్తే పరిష్కారవుతుందా?: ధూళిపాళ్ల

తాజా వార్తలు

Updated : 08/07/2021 13:04 IST

లేఖలు రాస్తే పరిష్కారవుతుందా?: ధూళిపాళ్ల

విజయవాడ: కృష్ణా జలాల వృథాపై విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద తెదేపా నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. నారుమళ్లకు ఇవ్వకుండా కృష్ణా నికర జలాలు సముద్రం పాల్జేస్తున్నారంటూ ఆందోళన చేశారు. నిరసనలో పాల్గొన్న తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. ‘‘రైతుల ప్రయోజనాలు కాపాడేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరించట్లేదు. రైతులకు ఇవ్వాల్సిన నీళ్లు సముద్రం పాల్జేయడం దుర్మార్గం. జల వివాదాలపై లేఖలు రాస్తే సమస్య పరిష్కారమవుతుందా?అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఎందుకు డిమాండ్‌ చేయట్లేదు?సీఎం జగన్‌ మౌనం.. రైతుల ప్రయోజనాలను దెబ్బతిస్తోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలో ఆ పార్టీ నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని