AP News: ఔషధం పంపిణీలో ప్రభుత్వ పెద్దల జోక్యమేంటి?: యనమల

తాజా వార్తలు

Updated : 07/06/2021 12:43 IST

AP News: ఔషధం పంపిణీలో ప్రభుత్వ పెద్దల జోక్యమేంటి?: యనమల

అమ‌రావ‌తి: అవినీతిని ప్ర‌శ్నిస్తే కేసులు, ఎదిరిస్తే సంకెళ్లు అనే రీతిలో వైకాపా పాల‌న సాగుతోంద‌ని తెదేపా సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఎద్దేవా చేశారు. ఆనంద‌య్య ఔష‌ధం పంపిణీలో ప్ర‌భుత్వ పెద్ద‌ల జోక్య‌మేంటని ఆయన ప్ర‌శ్నించారు. ఈ ఔష‌ధాన్ని సొమ్ము చేసుకునేందుకే అధికార పార్టీ నాయ‌కులు పాట్లు పడుతున్నార‌ని ఆరోపించారు. ఔష‌ధ పంపిణీపై వెబ్‌సైట్ రూపొందించి రూ.కోట్లు కొల్ల‌గొట్టేందుకు య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. దీనిపై ప్ర‌శ్నించిన మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు ఎలా పెడ‌తారని య‌న‌మ‌ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సంగం డెయిరీని నిర్వీర్యం చేసే కుట్ర‌లో భాగంగా ధూళిపాళ్ల న‌రేంద్రపైనా అక్ర‌మంగా కేసు పెట్టార‌ని ఆయన ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని