రాష్ట్ర బంద్‌కు తెదేపా మద్దతు: చంద్రబాబు

తాజా వార్తలు

Published : 03/03/2021 23:46 IST

రాష్ట్ర బంద్‌కు తెదేపా మద్దతు: చంద్రబాబు

అమరావతి: విశాఖ ఉక్కు కోసం ఎల్లుండి చేపట్టిన రాష్ట్ర బంద్‌కు తెదేపా మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, కార్మిక సంఘాలకు కూడా తమ వంతుగా మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. బంద్‌ వల్ల చిత్తూరు, తిరుపతిలో తలపెట్టిన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల అంశంలో తెదేపా ఎప్పుడూ రాజీపడదని, పార్టీ నేతలు, కార్యకర్తలు బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని