తెలంగాణలో తీన్మార్‌ మల్లన్న పాదయాత్ర

తాజా వార్తలు

Published : 18/07/2021 18:11 IST

తెలంగాణలో తీన్మార్‌ మల్లన్న పాదయాత్ర

మేడ్చల్‌: తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. పాదయాత్ర చేస్తామని ఇప్పటికే పలువురు నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తీన్మార్‌ మల్లన్న కూడా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో తన అభిమానులతో మల్లన్న సమావేశమయ్యారు. ఆగస్టు 29న జోగులాంబ గద్వాల్‌ జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్టు తీన్మార్‌ మల్లన్న ప్రకటించారు. పాదయాత్రకు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఆహ్వానిస్తామని తెలిపారు. తమ పార్టీలో చేరాలంటూ కొందరు నేతలు ఆహ్వానించారని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్‌ షర్మిల ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డు ఎక్కడ ఉందో చెప్పాలని మల్లన్న డిమాండ్‌ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని